తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల కోడిగుడ్డు లభ్యం

Archaeologists Find 1000 Year Old Chicken Egg Preserved Found Israel - Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో ఇటీవ‌ల జ‌రిపిన‌ తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది. ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా సురక్షితంగా ఉన్న‌ది. దానికి బ‌య‌ట‌కు తీసి శుభ్రపరుస్తుండ‌గా పగుళ్లు వచ్చాయి. వెయ్యేండ్ల నాటి ఈ కోడిగుడ్డును అతి జాగ్రత్తగా భ‌ద్రప‌రిచేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోడిగుడ్లు వారం రోజుల‌కే చెడిపోతున్న త‌రుణంలో వేయి సంవ‌త్సరాల నుంచి ఈ కోడిగుడ్డు ఎలా భ‌ద్రంగా ఉందో క‌నుక్కొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయ‌త్నాలు ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని పురాతన గుడ్లలో ఒకటి అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి ఇజ్రాయెల్ పురావస్తు విభాగం ఫేస్‌బుక్‌లో ఒక వివరణాత్మక పోస్ట్‌ను షేర్ చేశారు.

ఇజ్రాయెల్‌లోని యావ్నేలో పట్టణ అభివృద్ధి ప్రాజెక్టు పనుల తవ్వకాల‌ సమయంలో ఈ పురాత‌న కోడిగుడ్డు దొరికింది. ఈ గుడ్డు 10 వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. యావ్నేలో పురావస్తు త్రవ్వకాల్లో దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి కోడిగుడ్డు కనుగొన్నాం అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి అతిపురాత కోడిగుడ్డు దొర‌క‌డం చాలా అరుదు అని ఇజ్రాయేల్ పుర‌వాస్తు విభాగానికి చెందిన నిపుణురాలు డాక్టర్‌ లీ పెర్రీ గాల్ చెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top