పాక్‌లో 1300 ఏళ్లనాటి హిందూ దేవాలయం!

1300 Year Old Ancient Hindu Temple Discovered In Pakistan Excavation - Sakshi

ఇస్లామాబాద్‌: దాయాది దేశాలైన పాకిస్తాన్‌-భారత్‌లు ఒకప్పుడు ఒకే భూభాగంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రెండు దేశాలుగా విడిపోక ముందు భారత్‌కు వాయువ్యంలో ఉన్న కరాచి కొంత భాగం పాకిస్తాన్‌, మరికొంత భాగం భారత్‌లో ఉండేది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్లోని‌ కరాచి జిల్లాకు సమీపంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో అత్యంత పురాతనమైన హిందూ దేవాలయం బయటపడింది. పాకిస్తాన్‌, ఇటాలీయన్‌ పురావస్తు శాఖ స్వాత్‌ జిల్లాలోని బరీకోట్‌ ఘుండాయ్‌ ప్రాంతంలో ఈ తవ్వకాలను చేపట్టింది. ఈ క్రమంలో గురువారం 1300 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయం వెలుగు చూసినట్లు పాక్‌ పురావస్తు శాఖ చీఫ్‌ ఫజల్‌ ఖాలిక్‌ తెలిపారు. అయితే ఇది శ్రీమహావిష్ణువు ఆలయంగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం దాదాపు 1300 ఏళ్ల నాటిదని, హిందూషాహి రాజ్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. (చదవండి: ఆరేళ్లుగా వీడని మిస్టరీ.. తనను మిస్సవుతున్నా!)

క్రీ.శ. 850-1026 మధ్య కాలంలో హిందూషాహి పాలకులు వాయువ్య భారత ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర కూడా చెబుతోంది. వీరిని హిందూషాహీలు లేదా కాబూల్ షాహీలు అని పిలుస్తారంట. దీన్ని ఒక హిందూ రాజ్యవంశంగా పిలుచుకునేవారని, ఈ రాజ్యవంశీయులే మహావిష్ణువు ఆలయాన్ని నిర్మించి ఉంటారని అధికారులు తెలిపారు. అంతేగాక ఈ ఆలయానికి మరోవైపు పరిసర ప్రాంతాల్లో కంటోన్మెంట్‌, వాచ్ టవర్ వంటి జాడలను కూడా పురావస్తు శాఖ కనుగొంది. అయితే స్వాట్ జిల్లాలో వెయ్యేళ్ల కిందటి పురావస్తు ప్రదేశాలు ఉన్నాయని.. ఇప్పటి వరకు ఎన్నో పురావస్తు వస్తువుల బయటపడ్డాయని ఫజల్‌ ఖాలిక్‌ అన్నారు. అయితే హిందూషాహీల నాటి జాడలు మాత్రం మొదటిసారిగా బయటపడ్డాయని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: సౌదీ నోటుపై భారత్‌ సరిహద్దు వివాదం పరిష్కారం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top