నెలాఖరులోగా పెండింగ్‌ పనులు పూర్తి | - | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా పెండింగ్‌ పనులు పూర్తి

Apr 3 2026 9:55 AM | Updated on Apr 3 2026 9:55 AM

సాక్షి,సిటీ బ్యూరో : తాగునీరు, సీవరేజీ పనుల నాణ్యతలో జవాబుదారీతనం అవసరమని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖైరతాబాద్‌ లోని ప్రధాన కార్యాలయంలో వివిధ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దన్నారు. ప్రతీ రీజియన్‌ లో ఇద్దరు క్వాలిటీ కంట్రోల్‌ అధికారులను నియమించి తనీఖీ చేసి, పనుల నాణ్యతపై సర్టిఫికేషన్‌ అందించే విధంగా నూతన పద్ధతిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో అనుమతులు పొందిన పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని దానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.

పెండెన్సీ లేకుండా ట్యాంకర్ల డెలివరీ

ఈ వేసవిలో ట్యాంకర్‌ డెలివరీలో పెండెన్సీ లేకుండా చూసుకోవాలని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి అదేశించారు. మంచినీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. జేఎండీ మయాంక్‌ మిట్టల్‌, రీజియన్ల ఈడీలు పంకజ, సామ్రాట్‌ అశోక్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement