తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యకేసులో ఐదుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యకేసులో ఐదుగురి అరెస్ట్‌

Apr 3 2026 9:55 AM | Updated on Apr 3 2026 9:55 AM

మూసాపేట: తల్లి, ఇద్దరు పిల్లలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసులు అయిదుమందిని రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. వరంగల్‌ జిల్లాకు చెందిన బోడ స్రవంతి (30), బోడ ప్రవీణ్‌ (32)లు మూసాపేటలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కార్తిక్‌ (12) కౌశిక్‌ (10). అయితే స్రవంతిని ప్రవీణ్‌ చాలాకాలంనుంచి వేధిస్తున్నాడు.ఈ క్రమంలో ప్రవీణ్‌ తన మేనత్త కూతురు మహేశ్వరిని 2024లో రెండవ వివాహం చేసుకున్నాడు. ఇందుకు ప్రవీణ్‌ తల్లిదండ్రులు కూడా సహకరించారు. ఇది భరించలేనిస్రవంతి పిల్లలను తీసుకుని తల్లి ఇంటికి వెళ్లి పంచాయితీ పెట్టింది. ఆ తరువాత ప్రవీణ్‌ పద్ధతిగా ఉంటానని చెప్పడంతో గత నెల 30న మూసాపేటకు వచ్చారు. అదే రోజు రాత్రి ఇద్దరికీ గొడవ జరిగింది. భర్త కొడుతున్నాడని, చంపుతానని బెదిరిస్తున్నాడంటూ వాయిస్‌ రికార్డు చేసి బంధువులకు, అన్నదమ్ములకు మెసేజ్‌ పంపింది. పిల్లలు కూడా మెసేజ్‌ పంపారు. అనంతరం స్రవంతి, ఇద్దరు కుమారులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి భర్త ప్రవీణ్‌, తండ్రి శంకర్‌ (64), తల్లి మణెమ్మ (48), రెండవ భార్య మహేశ్వరి (23), స్నేహితుడు అనిల్‌ (28)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకుందా లేదా అందరూ ఒకేసారి వేసుకున్నారా పోస్టుమార్టంలో తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement