
జీహెచ్‌ఎంసీ ప్రజావాణికి 122 అర్జీలు
లక్డీకాపూల్: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 63 అర్జీలు వచ్చాయి. అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 36, రెవెన్యూ (ప్రాపర్టీ ట్యాక్స్ 6, ఇంజనీరింగ్, ఫైనాన్స్ అకౌంట్ 5 విభాగాలకు చొప్పున, ఎలక్షన్, విజిలెన్స్ విభాగాలకు రెండు చొప్పున, యు.బి.డి, అడ్మినిస్ట్రేటివ్, యు.సి.డి., హెల్త్ విభాగాలకు ఒకటి, ఫోన్ ఇన్ ద్వారా 3 చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఆరు జోన్లలో మొత్తం 59 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 25, శేరిలింగంపల్లి జోన్‌లో 13, సికింద్రాబాద్ జోన్ లో 11, ఎల్బీనగర్ జోన్ లో 06, చార్మినార్ జోన్ లో 04 ఫిర్యాదులు అందాయి. కమిషన్ ఆర్.వి.కర్ణన్ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికిగాను సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల విన్నపాల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు పంకజ, సత్యనారాయణ, వేణు గోపాల్, రఘు ప్రసాద్, సీసీపీ శ్రీనివాస్, అడిషనల్ ఎస్.పి (విజిలెన్స్) సుదర్శన్, సి.ఈ. రత్నాకర్, హౌసింగ్ సి.ఈ. నిత్యానంద, అడిషనల్ సి.సి. పి.లు గంగాధర్, వెంకన్న, ప్రదీప్, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అబ్దుల్ వకీల్, సి.వి.ఓ. మహేష్ కులకర్ణి పాల్గొన్నారు.