జలమండలి వినియోగదారులకు సేవలు
జలమండలి వినియోగదారులకు సేవలు
సాక్షి, సిటీబ్యూరో: తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణలో అధునాతన సాంకేతికతతో సేవలందిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ జలమండలి..తాజాగా వినియోగదారుల ఫిర్యాదులను సైతం త్వరితగతిన పరిష్కరించడానికి ఏఐ (కత్రిమ మేధ) సాంకేతికతను వినియోగిస్తోందని ఎండీ అశోక్‌రెడ్డి వెల్లడించారు. ఈమేరకు గత సంవత్సర కాలంలో మెట్రో కస్టమర్ కేర్ (ఎంసీసీ)లో నమోదైన ఫిర్యాదులు, ట్యాంకర్ బుకింగ్ వివరాలను ఏఐ సాంకేతికత ద్వారా కొన్ని రోజులగా ఐటీ విభాగపు అధికారులు విశ్లేషిస్తున్నారని చెప్పా రు. కాగా జలమండలి కస్టమర్ కేర్‌కు గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి..ఇప్పటివరకు 6 లక్షల 50 వేలకు పైగా వివిధ సమస్యలపై ఫిర్యాదులు అందగా, 12 లక్షలకు పైగా వాటర్ ట్యాంకర్లను వినియోగదారులు బుక్ చేసుకున్నారు. అత్యధికంగా ట్యాంకర్ బుక్ చేసిన టాప్ 10 మంది వినియోగదారులను గుర్తించారు. ప్రగతినగర్‌లోని సౌహితి ఎంకే రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ వాసులు 674 ట్యాంకర్లను బుక్ చేసినట్టు తేల్చారు.
ప్రగతినగర్‌లో పర్యటన
ప్రగతీనగర్ లో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించి స్థానికులతో ముచ్చటించారు. గతంలో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు 15 రోజులకోసారి నీటి సరఫరా జరిగేదని, తరువాత జలమండలి పరిధిలోకి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి మంచి నీరు సరఫరా జరుగుతుందని వివరించారు. రోజు విడిచి రోజు నీటి సరఫరా అందేలా చూడాలని స్థానికులు ఎండీకి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ప్రగతినగర్ సంపునకు ప్రత్యేక ఫీడర్ మెయిన్‌ను అభివద్ధి చేస్తే ఈ సమస్య తీరిపోతుందని, దానికి రూ.3 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు ఎండీకి వివరించారు. ప్రతిపాదనలను పరిశీలించిన ఎండీ వెంటనే పనులు చేపట్టాలని ఆమోద ముద్ర వేశారు.
ప్రగతి నగర్‌లో అత్యధికంగా వాటర్ ట్యాంకర్లను బుక్ చేసిన సౌహితి ఎంకే రెసిడెన్సీ అపార్టుమెంటును జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులతో కలిసి సందర్శించారు. ప్రాంగణంలో పాడైన బోర్ వెల్‌ను గుర్తించి..వాటిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాలమైన అపార్టుమెంటు ఆవరణలో కొన్ని ఇంజెక్షన్ బోర్లు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి ఆవరణలోని బోరు పనిచేసే అవకాశం ఉంటుందని వివరించారు. అవసరమైన సాంకేతిక సహాయం జలమండలి స్థానిక అధికారులు అందజేస్తారని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీజీఎం ఆనంద్ నాయక్, జీఎం సుబ్బారాయుడు, డీజీఎం చంద్ర మోహన్, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
ఎండీ అశోక్‌రెడ్డి వెల్లడి
అత్యధిక ట్యాంకర్లు బుక్‌చేసిన అపార్టుమెంట్ సందర్శన
ఏఐ టెక్నాలజీతో