
రెండు గేట్ల ద్వారా మూసీలోకి వెళ్తున్న నీరు
నిండు కుండల్లా రెండు రిజర్వాయర్లు
సాక్షి, సిటీబ్యూరో/మణికొండ: నగర శివారులోని జంట జలాశయాలు నిండుకుండున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువన నీరు విడుదల చేస్తుండగా.. బుధవారం సాయంత్రం ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. పరీవాహక ప్రాంతాల్లోని నివాసాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది.
హిమాయత్‌సాగర్
పూర్తిస్థాయి నీటి మట్టం : 1,763.50 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 1,763.00 అడుగులు
ఇన్‌ఫ్లో : 1600 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 1,017
మొత్తం గేట్లు : 17
ఎత్తిన గేట్లు : 1 గేటు మూడు అడుగుల మేర
ఉస్మాన్‌సాగర్
పూర్తి స్థాయి నీటి మట్టం : 1,790 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 1,788.60 అడుగులు
ఇన్‌ఫ్లో : 1200 క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో : 220
మొత్తం గేట్లు : 15
ఎత్తిన గేట్లు : 2 గేట్లు.. అడుగు మేర