
సచివాలయంలో అరుదైన పక్షి
ఆఫ్రికన్ గ్రే ప్యారెట్‌గా గుర్తించిన అటవీశాఖ సిబ్బంది
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయానికి బుధవారం అరుదైన అతిథి వచ్చింది. సచివాలయంలోని చీఫ్ సెక్రటరీ కార్యాలయం పేషీ సిబ్బంది వద్దకు ఓ అరుదైన పక్షి వచ్చి వాలింది. వాతావరణం చల్లగా ఉండటం, వర్ష ప్రభావం వల్ల..ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి సచివాలయానికి చేరింది. దీనిపై కార్యాలయంలోని సిబ్బంది అటవీశాఖకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ పక్షిని ఆఫ్రికన్ గ్రే ప్యారెట్‌గా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.