
పోలీస్ బ్యాండ్ రిహార్సల్స్
గోల్కొండ కోటలో గురువారం పంద్రాగస్టు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆగష్టు 15న ముఖ్యమంత్రి గోల్కొండ కోటలో పతాకావిష్కరణ గావించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా గురువారం వివిధ శాఖల అధికారులు కోటలో వేడుకలకు ఏర్పాట్లు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అధికారులు పతాకావిష్కరణ జరిగే వేదిక, పరిసరాలను శుభ్రం చేయించారు. పోలీస్ బ్యాండ్ రిహార్సల్స్ చేపట్టాయి. కోట మెయిన్ గేట్ సమీపంలోని గ్రౌండ్‌లో సాయుధ బలగాలు గౌరవ వందనం రిహార్సల్స్, బ్యాండ్ రిహార్సల్స్ నిర్వహించాయి. –గోల్కొండ