
మాదకద్రవ్యాల విక్రేతల అరెస్ట్
66 గ్రాముల హెరాయిన్, బ్రౌన్ షుగర్ స్వాధీనం
చందానగర్ : హెరాయిన్, బ్రౌన్ షుగర్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ క్రిష్ణ ప్రియ ఆదేశాల మేరకు శంషాబాద్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో డీటీఎఫ్ పోలీసులు బుధవారం ఖాజాగూడలో హెరాయిన్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన నూర్ అక్తర్, అజత్ మెమిన్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 66 గ్రాముల హెరాయిన్, బ్రౌన్ షుగర్‌తో పాటు రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శేరిలింగంపల్లి మండల ఎకై ్సజ్ పోలీసులు అప్పగించడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుళ్లు గణేష్, మల్లేష్, నెహ్రూ, సాయి శంకర్ పాల్గొన్నారు.