యువకుడిపై హత్యాయత్నం
బండరాయితో దాడి
బంజారాహిల్స్: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి దారికాసి ఆమె ప్రియుడిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆసిఫ్‌నగర్‌కు చెందిన షేక్ ఆదిల్ టెంట్‌హౌస్‌లో పని చేసేవాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–10సీ లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న బోయిన్‌పల్లికి చెందిన మహిళతో అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ప్రతిరోజూ ఆదిల్ ఆమెను ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో బైక్‌పై ఎక్కించుకుని బోయిన్‌పల్లిలో ఇంటి సమీపంలో వదిలేసేవాడు. బుధవారం రాత్రి ఆదిల్ ఆమెను బైక్ ఎక్కించుకుని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా వెళ్తుండగా అప్పటికే పథకం ప్రకారం చెక్‌పోస్టు సమీపంలో దారికాచిన ఆమె భర్త అంజద్ వీరిని అడ్డగించాడు. అందరూ చూస్తుండగానే ఆదిల్ తలపై బండరాయితో మోది అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆదిల్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.