
హైదర్షాకోట్‌లో భారీ చోరీ
● 26 తులాల బంగారం
రూ.4.5 లక్షల నగదు అపహరణ
మణికొండ: బోనాల పండగకు సొంత ఊరికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి భారీగా నగలు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీధర్ రెడ్డి హైదర్షాకోట్, కపిలానగర్ కాలనీలో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. బోనాల పండగ నేపథ్యంలో ఈ నెల 3న అతను కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. గురువారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనకవైపు కిచెన్ డోర్‌ను తెరచి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. అల్మరాలో ఉన్న 26 తులాల బంగారు నగలు, రూ.4.50 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. విచారణ చేపట్టామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

హైదర్షాకోట్‌లో భారీ చోరీ