● వరంగల్ కలెక్టర్ సత్యశారద
● ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పరిశీలన
కాశిబుగ్గ: ఎంజీఎం సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పెండింగ్ నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద.. అఽధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి ఆస్పత్రి పనులను ఆమె పరిశీలించారు. త్వరలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఆస్పత్రి నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచి ంచారు. ఔట్ పేషంట్ డిపార్ట్‌మెంట్లు, ఫార్మసీ, ఐసీయూ, ఎమర్జెన్సీ, ల్యాబ్‌లు, ఆపరేషన్ థియేటర్, ధర్మశాల, టాయిలెట్స్ తదితర పనులను సంబంఽధిత అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఆమెవెంట అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్.కిషోర్‌కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి, డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డాక్టర్ అశ్విని, ఎల్‌అండ్‌టీ బాధ్యుడు శరవణ్ ఉన్నారు.


