కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని మేథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ (ఐసీపీఎస్)26ను గురువారం అట్టహాసంగా ప్రారంభించారు. ‘వారసత్వం నుంచి సురక్షిత భవిష్యత్’ అనే అంశంతో సెమినార్ ఏర్పాటు చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ సౌరవ్ ముఖోపాధ్యాయ్, నిట్ డిప్యూటీ డైరెక్టర్ రథీష్‌కుమార్, డీన్ సోనవానే శిరీష్, మేథమెటిక్స్ హెచ్ సెల్వరాజ్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీనివాసరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి సావనీర్‌ను విడుదల చేశారు.


