హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయాన్ని గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్ జనరల్ రాజర్షి ద్వివేది ఐఆర్‌ఎస్ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు, ధర్మకర్తలు రాజర్షి ద్వివేది దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. వారి వెంట శ్రీకాంత్ ఐఆర్‌ఎస్ తదితరులు ఉన్నారు.
డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్
విద్యారణ్యపురి: హనుమకొండలో జిల్లా స్థాయి సైన్స్, గణిత, సాంఘిక శాస్త్ర ప్రదర్శనలు (ఎగ్జిబిట్స్) డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో కాజీపేటలోని సేయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు గురువారం హనుమకొండ డీఈవో ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ తెలిపారు. జిల్లాలోని విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనా విధానం, పరిశోధనా ఆసక్తి, నూతన ఆవిష్కరణలు ప్రొత్సహించే లక్ష్యంతో జిల్లా స్థాయిలో ఈసైన్స్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, ఐదు విభాగాల్లో రాజ్యస్థరీయ బాలవైజ్ఞానిక ప్రదర్శిని (ఆర్‌ఎస్‌బీవీపీ) (2026–27) జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌కు 300 ఎగ్జిబిట్లు, ఇన్స్‌పైర్ అవార్డ్స్ 2025–26 పొందిన విద్యార్థులు జిల్లా స్థాయి ఎగ్జిబిట్లు, ప్రాజెక్టులు 82, పీఎంశ్రీ సైన్స్ ఉన్నత పాఠశాలల నుంచి 30 సైన్స్ ఎగ్జిబిట్లు, సాంఘిక శాస్త్ర ప్రదర్శనలు 49, తెలంగాణ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ (టీఎఫ్‌ఐసీ) 1.0 విద్యార్థుల నుంచి 30, ఇలా.. మొత్తం 491 ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రధర్శించనున్నట్లు డీఈఓ తెలిపారు. కాగా, డిసెంబర్2న విద్యార్థుల ఎగ్జిబిట్ల నమూనాల నమోదు, 3వ తేదీన 5 విభాగాల ప్రదర్శనలు ప్రారంభోత్సవం, 4వ తేదీన సాయంత్రం ముగింపు కార్యక్రమం ఉంటుంది.
వరంగల్ లీగల్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంతో పాటు జిల్లాలోని వివిధ పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు రాజ్యాంగ పీఠికలో పొందుపర్చిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని ఈసందర్భంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ సిబ్బంది, న్యాయవాదులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ: హనుమకొండలోని కాకతీయ వైద్య కళాశాల ఎంఆర్‌యూ ఉద్యోగాలకు కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ నియామకాలు ఏడాది పాటు ఉంటాయని ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్‌దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా.. రీసెర్చ్ సైంటిస్ట్– (సైంటిస్ట్ సి) 1, రీసెర్చ్ సైంటిస్ట్– (సైంటిస్ట్–బి) 1, ల్యాబ్ టెక్నీషియన్ 2, ల్యాబ్ అసిస్టెంట్–1 చొప్పున భర్తీ చేస్తామని పేర్కొన్నారు. సైంటిస్ట్ పోస్టులకు రూ.1,000, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.500 దరఖాస్తు రుసుమును కేఎంసీ ఎంఆర్‌యూ పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో తీసిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను సమర్పించాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను డిసెంబర్ 3, సాయంత్రం 5 గంటల వరకు సమర్పించాలని, 7న అర్హులైన జాబితాను ప్రకటిస్తామని, 11న అర్హులైనవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. ఇతర వివరాలకు కళాశాల వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌ను పరిశీలించాలని ఆయన కోరారు.


