మహిళల రక్షణకు వందరోజుల ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణకు వందరోజుల ప్రణాళిక

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

కేయూ క్యాంపస్‌: మహిళలు తమ హక్కులను తెలుసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద సూచించారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆవరణలో బతుకమ్మ వేడుకల్లో ఆమె శుక్రవారం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతీ ఆడపడుచుకు ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. విద్యార్థినులు విద్యార్థి దశనుంచే తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మహిళలు ధైర్యంగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళల హక్కులపై విస్తృత అవగాహన కల్పించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యక్రమాన్ని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల నుంచే ప్రారంభించనున్నట్లు చెప్పారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం, యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జ్యోతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ రెహమాన్‌, కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, కేయూ పాలకమండలి సభ్యులు రమ, అనితారెడ్డి, నాయిని నీలిమ, మహిళా కమిషన్‌ సభ్యులు రాధాబాయి, రమాదేవి పాల్గొన్నారు.

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement