ఆక్రమణలపైనే అధిక ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలపైనే అధిక ఫిర్యాదులు

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

ఆక్రమణలపైనే అధిక ఫిర్యాదులు

వరంగల్‌ అర్బన్‌: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం అందించడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ టి.వెంకన్న అన్నారు. సోమవారం బల్దియా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్‌ వెంకన్న ప్రజల నుంచి 81 దరఖాస్తులు స్వీకరించారు. గత వారం స్వీకరించిన దరఖాస్తుల పరిష్కార పురోగతిని కమిషనర్‌ సమీక్షించారు. కాగా, టౌన్‌ప్లానింగ్‌కు 32, ఇంజనీరింగ్‌ 28, ఆరోగ్యం, పారిశుద్ధ్యం 9, రెవెన్యూ 9, నీటి సరఫరా 3 అర్జీలు అందాయి. కాగా, ఆక్రమణలపైనే అధికంగా ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

పండుగలకు ఏర్పాట్లు చేయండి..

కమిషనర్‌ అధికారులతో సమావేశమై మాట్లాడారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌, రహదారుల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాట్లు తదితర మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సూచించారు.

వెరిఫికేషన్‌ వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని కమిషనర్‌ ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ ప్రక్రియను సమన్వయంతో చేపట్టి, పెండింగ్‌ లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ జోనా, సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ రాజ్‌కుమార్‌, డీఎఫ్‌ఓ శంకర్‌లింగం, సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు పాల్గొన్నారు.

గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌సెల్‌కు

81 దరఖాస్తులు

అర్జీలు స్వీకరించిన

కమిషనర్‌ వెంకన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement