మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి

● డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పూజిత

హసన్‌పర్తి : మహిళలు విద్య నైపుణ్యాభివృద్ధి ద్వారా శక్తివంతంగా ఎదిగితే దేశ ప్రగతికి బలమైనపునాది ఏర్పడుతుందని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎస్‌ఎల్‌ఏ) కార్యదర్శి నేరెళ్ల వెంకట హైమ పూజిత అన్నారు. 56వ డివిజన్‌ జవహర్‌కాలనీలో శిఖర స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో సోమవారం మహిళా సాధికారతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పూజిత హాజరై మాట్లాడుతూ.. కుటుంబ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలు విశేష ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, అంతరిక్ష రంగాల్లో మహిళలు ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పారు. నైపుణ్యా శిక్షణ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగదాలు, లైంగిక వేధింపులు, బెదిరింపులు సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సమితి జిల్లా కో–ఆర్డినేటర్‌ సుదర్శన్‌, శిఖర స్కిల్‌ సెంటర్‌ ట్రైనర్లు ఝాన్సీ చంద్రకళ, జ్యోతి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement