రైతులకు అండగా కామన్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ | - | Sakshi
Sakshi News home page

రైతులకు అండగా కామన్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

ఖిలా వరంగల్‌ : రైతులు, ఎఫ్‌పీఓలు (రైతు ఉత్పత్తిదారుల సంస్థలు) తమ ఉత్పత్తులకు విలువ జోడించి మెరుగైన మార్కెటింగ్‌ అవకాశాలు పొందేందుకు కామన్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ దోహడపడుతుందని మినిస్ట్రీ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ (ఎంఓఎఫ్‌పీఐ) జాయింట్‌ సెక్రటరీ దేవేష్‌ దివాల్‌ (ఐఏఎస్‌) అన్నారు. ఈ మేరకు సోమవారం వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం(ఆర్‌ఏఆర్‌ఎస్‌)లో ఏర్పాటు చేసిన కామన్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో పసుపు, మిరప ప్రాసెసింగ్‌ లైన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంటర్‌లో ఏర్పాటు చేసిన యంత్రాల పనితీరు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. ఈ సదుపాయాలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. సంచాలకులు డాక్టర్‌ ఎం. బలరాం, వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్‌ సంచాలకులు డాక్టర్‌ ఎం, శ్రీధర్‌, ప్రిన్సిపాల్‌ అగ్రికల్చర్‌ కాలేజీ వరంగల్‌, తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ డైరెక్టర్‌ సుష్మ, ఎంఓఎఫ్‌పీఐ మేనేజర్‌ రాకేశ్‌, శాస్త్రవేత్త వెంకట రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

మినిస్ట్రీ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ జాయింట్‌ సెక్రటరీ దేవేష్‌ దివాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement