అంతర్జాతీయ సదస్సులో విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సదస్సులో విద్యార్థి ప్రతిభ

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

ఖిలా వరంగల్‌ : దుబాయ్‌లోని కెనడియన్‌, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరిగిన ఐవీ లీగ్‌ నమూనా ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ సదస్సు–26లో వరంగల్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి డి.ఇషాన్‌చంద్ర ప్రతిభ చాటారు. అంతర్జాతీయ సదస్సు–26లో ది హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థి ఇషాన్‌ హాజరై అధికారుల ఎదుట విదేశీ దౌత్యం, చర్చలు, సంప్రదింపులు, నాయకత్వ నైపుణ్యాలు ప్రదర్శించారు. లోతైన పరిశోధన, స్పష్టమైన ఆలోచన, సమగ్ర అవగాహనతో పాటు ఆచరణాత్మక పరిష్కారాలు చూపిన ఇషాన్‌ చంద్రను అభినందిస్తూ ఉత్తమ స్థానపత్రం, పురస్కారం అందజేశారు. ఈమేరకు శనివారం వరంగల్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఇషాన్‌ను హెచ్‌ఎం సరితారెడ్డి, ఉపాధ్యాయులు అంకూష్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement