జేఎన్‌ స్టేడియంలో ఎస్‌జీఎఫ్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

జేఎన్‌ స్టేడియంలో ఎస్‌జీఎఫ్‌ ఎంపికలు

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌ : హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో సోమవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎస్‌జీఎఫ్‌–19 క్రీడా పోటీలు నిర్వహించారు. నాలుగో విడతలో భాగంగా చెస్‌, సాఫ్ట్‌ టెన్నిస్‌, క్యారం, వూషూ, సెపక్‌తక్రా పోటీలు జేఎన్‌ స్టేడియంలో, బాడ్మింటన్‌ను ఎల్‌బీ కాలేజీ ఇండోర్‌ గ్రౌండ్‌లో నిర్వహించారు. సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 జిల్లా కార్యదర్శి నరేడ్ల శ్రీధర్‌ అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్‌ సతీశ్‌, డాక్టర్‌ గోపి, ప్రభాకర్‌ రెడ్డి, దేవేందర్‌, శ్రీనివాస్‌, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు బొగ్గు కొరత

హన్మకొండ : యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి బొగ్గు కొరతతో తరచూ అంతరాయం ఏర్పడుతోందని తెలంగాణ విద్యుత్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ పి.శ్రీనివాస్‌, కన్వీనర్‌ మన్నె శశికుమార్‌ తెలిపారు. డీపీఆర్‌ ప్రకారం ఈ కేంద్రానికి ఏటా రూ.1.37 కోట్ల టన్నుల ఏ8/ఏ9 గ్రేడ్‌ బొగ్గు అవసరమని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2022లో టీజీ జెన్‌ కో, సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌తో బొగ్గు సరఫరా ఒప్పందం చేసుకుందన్నారు. యాదాద్రికి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం సాధ్యం కాదని సింగరేణి కాలరీస్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఏ13/ఏ15 గ్రేడ్‌ నాసిరకం బొగ్గును వినియోగించడం వల్ల సాంకేతిక ట్రిప్పులు, తరచూ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. నేటినుంచి కోల్‌ ఇండియాతో జరగనున్న చర్చల్లో సింగరేణి ప్రయోజనాలకు భంగం కలగకుండా యాదాద్రి కేంద్రానికి ఏ8/ఏ9 గ్రేడ్‌ బొగ్గు సరఫరాపై భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

సత్ఫలితాలిస్తున్న

‘విద్యా ప్రేరణ’

హసన్‌పర్తి : బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడమే కాకుండా మాదకద్రవ్యాలు వంటి చెడు అలవాట్లను దూరంగా ఉంచేందుకు పోలీస్‌ కమిషనర్‌ చేపట్టిన ‘విద్యా ప్రేరణ’ కార్యక్రమం సల్ఫితాలిస్తోంది. వరంగల్‌ సబ్‌ డివిజన్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 42 మంది విద్యార్థులు బడి మానేసినట్లుగా గుర్తించారు. వీరిలో 22 మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్‌, ఇతర విద్యా సామగ్రి అందించారు.

నేడు జిల్లా విద్యాశాఖపై సమావేశం

విద్యారణ్యపురి : హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్లు, ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్మాస్టర్లతో మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు కలెక్టరేట్‌లో సమావేశం జరగనున్నట్లు డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌ తెలిపారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌ సభ్యులు, తనిఖీ బృందాలు, 108 ఎఫ్‌ఎల్‌ఎన్‌ కాంపిటెంట్‌ స్కూల్స్‌ హెచ్‌ఎంలు హాజరుకావాలని సూచించారు. జిల్లాలో జరుగుతన్న వివిధ విద్యా కార్యక్రమాలపై కలెక్టర్‌ సమీక్షించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement