సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

హన్మకొండ : కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీఎస్‌ఈఈయూ)–327 రాజీలేని పోరాటం చేస్తోందని ఆ యూనియన్‌ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనగాల శ్రీధర్‌ అన్నారు. సోమవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్‌లోని పల్లా రవీందర్‌ రెడ్డి భవన్‌లో నిర్వహించిన టీఎస్‌ఈఈయూ–327 హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై టీఎస్‌ఈఈయూ–327 ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు నిర్వహించి విజయం సాధించామని వివరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సమ్మె కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు. కార్మికులకు మెరుగైన పీఆర్‌సీని వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టిజన్‌ కార్మికులకు రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగా అన్ని హక్కులు కల్పించేందుకు యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. యూనియన్‌ ఎన్పీడీసీఎల్‌ అధ్యక్షుడు. పి.మహేందర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సీనియర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీలం ఐలేష్‌, కంపెనీ కార్యదర్శి శ్రీనివాస్‌ రావు , వరంగల్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చిక బుచ్చయ్య గౌడ్‌, గుండా శ్రీనివాస్‌, నాయకులు జస్వంత్‌ కుమార్‌, సునీల్‌ కుమార్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక

టీఎస్‌ఈఈయూ–327 హనుమకొండ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిట్ల ఓదెలు, కార్యదర్శిగా దొనికల సదయ్య, ట్రెజరర్‌గా జి.పోచాలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా వి.సునీల్‌ కుమార్‌, జె.రమేశ్‌, చీఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎం.శ్రీనివాస్‌, బి.వెంకటేశ్వర్లు, అడిషనల్‌ సెక్రటరీగా కె.సుధాకర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌లుగా సయ్యద్‌ బాబా, జి.అశోక్‌, వి.మహేందర్‌, జాయింట్‌ సెక్రటరీగా ఎస్‌.రాజు, మహిళా ప్రతినిధిగా సాయిని సంధ్య, ఆఫీస్‌ సెక్రటరీ, మీడియా సెక్రెటరీగా చింతలపూడి సతీశ్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

టీఎస్‌ఈఈయూ

రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనగాల శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement