క్రీడలతో ఆత్మవిశ్వాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఆత్మవిశ్వాసం

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

● కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం

హసన్‌పర్తి: క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం అన్నారు. సోమవారం కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంటర్‌ కాలేజీఝెట్‌ పురుషుల టోర్నమెంట్‌ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడుతాయని పేర్కొన్నారు. కేయూ స్పోర్ట్‌ బోర్డ్‌ సెక్రటరీ శాస్త్రి మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన కిట్స్‌ కళాశాల అదనపు సెక్రటరీ సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ క్రీడలతో ఒత్తిడి అధిగమించొచ్చన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల నుంచి 47 కళాశాలల నుంచి 943 క్రీడాకారులు తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కార్యక్రమంలో కిట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అశోక్‌రెడ్డి, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కోమల్‌రెడ్డి, పీడీ డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్వో డాక్టర్‌ ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ల

పరీక్ష ఫీజు చెల్లించాలి

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ బీఎస్సీ, ఒకేషనల్‌ బీసీఏ, బీహెచ్‌ఎంఅండ్‌ సిటీ (రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌) మొదటి, మూడో, ఐదో సెమిస్టర్‌ పరీక్ష ఫీజులు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్‌ పి.వెంకటయ్య డాక్టర్‌ ఎం.తిరుమలాదేవి సోమవారం తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 26వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 30వరకు గడువు ఉందని, కోర్సుల వారీగా ఫీజుల వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వచ్చే నెలలో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement