భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పట్టణంలో కాసం ఫ్యాషన్స్ 30వ స్టోర్ సోమవారం ప్రారంభమైంది. సినీనటి నిధి అగర్వాల్ జ్యోతి ప్రజ్వలన చేసి స్టోర్‌ను ప్రారంభించారు. ఆమె రాకతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కాసం ఫ్యాషన్స్ పరిసరాలు సందడిగా మారాయి. నిధి అగర్వాల్ స్టోర్‌లోని లేడీస్, జెంట్స్, కిడ్స్ వేర్ విభాగాలను సందర్శించారు. అధునాతన డిజైన్లు, నూతన వైరెటీలతో కాసం ఫ్యాషన్స్ ప్రజాదరణ పొందుతోందని, భూపాలపల్లిలో స్టోర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా లేటెస్ట్ వస్త్రాలను ఇక్కడే కాసం ఫ్యాషన్స్‌లో కొనుగోలు చేసే అవకాశం లభించిందన్నారు. కాసం ఫ్యాషన్స్ డైరెక్టర్లు మాట్లాడుతూ ఐదేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆదరణతో 30 స్టోర్లను ఏర్పాటు చేశామన్నారు. భూపాలపల్లి స్టోర్ ద్వారా సుమారు 150 మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాసం ఫ్యాషన్స్ డైరెక్టర్లు కాసం నమఃశివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్, విశాల్, వరుణ్, అరుణ్, కార్తీక్, కాసం ఫణిత్, కాసం సాయికృష్ణ, కాసం దీక్షిత్, యాంసాని ప్రవీణ్ పాల్గొన్నారు.
సినీనటి నిధి అగర్వాల్ చేతుల మీదుగా 30వ స్టోర్ ఓపెన్


