కాజీపేట అర్బన్ : ఐఈఈఈ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్) సిస్టం కౌన్సిల్ న్యూయార్క్ 2027–29 విశిష్ట లెక్చర్ ప్రోగ్రామ్‌కు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీని ఎంపిక చేస్తు సోమవారం ఐఈఈఈ ప్రకటన విడుదల చేసింది. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నిట్ డైరెక్టర్ సేవలకు గాను ఇంటర్నేషనల్ స్థాయిలో ఐఈఈఈ గుర్తింపు సాధించడంతో నిట్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
తహసీల్ కార్యాలయానికి స్థల పరిశీలన
హన్మకొండ అర్బన్: హనుమకొండ సుబేదారిలో జిల్లా పరిషత్‌కు సంబంధించిన స్థలం, శిథిలావస్థకు చేరిన భవనాలు, ఖాళీ ప్రదేశాలను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సోమవారం పరిశీలించారు. హనుమకొండ తహసీల్దార్ కార్యాలయ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా కలెక్టర్ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి క్వార్టర్స్, ఖాళీ స్థలానికి సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు జెడ్పీ సీఈఓ బి. శేషాద్రి, డిప్యూటీ సీఈఓ కె.శ్రీనివాసరావు వివరించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


