మహిళా సంఘం భ వనం చుట్టూ పిచ్చిమొక్కలు | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘం భ వనం చుట్టూ పిచ్చిమొక్కలు

Oct 4 2026 11:13 AM | Updated on Oct 4 2026 11:13 AM

● పట్టించుకోని అధికారులు

వేలేరు : మండలంలోని పీచర మహిళా సంఘం భవనం నిర్వహణ లోపంతో అధ్వాన్నంగా మారింది. భవనం చుట్టూ పిచ్చిమొక్కలు, కంపచెట్లు ఏపుగా పెరిగి చెత్తాచెదారంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యింది. దీంతో మహిళా సంఘం భవనంలో సమావేశాలకు హాజరయ్యే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిచ్చిమొక్కలు, కంపచెట్లతో భవనం కనిపించకుండా ఉందని, భవనంలో సమావేశాలు జరిగే సమయంలో విషపురుగులు, పాములు సంచరించే ప్రమాదం ఉందని మహిళలు భయాందోళన చెందుతున్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు వినియోగించాల్సిన ఈ భవనం నిర్వహణ లోపంతో పిచ్చిమొక్కల నడుమ కనిపిస్తుండటంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మహిళా సంఘం భవనం చుట్టూ ఉన్న కంపచెట్లు, పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేయాలని మహిళలు, తదితరులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement