ఐనవోలు : క్రీడలతో మానసికోల్లాసం, క్రమశిక్షణ పెంపొందుతుందని తహసీల్దార్ విక్రమ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎంఈఓ పులి ఆనందం అధ్యక్షతన శనివారం జిల్లాస్థాయి క్రీడా విజేతలకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. మండలానికి జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. అండర్–17 బాలుర కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అండర్–14 బాలుర ఖోఖోలో జిల్లాస్థాయి మొదటి బహుమతులు సా ధించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అశోక్, యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరి గుగులోతు కిషన్‌నాయక్, ఎస్జీఎఫ్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరి సుమలత, పీఈటీలు ౖకైలాష్, కిరణ్, సందీప్, రమేశ్, రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.


