ఆదివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 4 2026 11:07 AM | Updated on Oct 4 2026 11:07 AM

– 8లోu జంతువుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు

న్యూస్‌రీల్‌

పాకాల కీకారణ్యంలో..

● వీధి జంతువులకు శుభ్రమైన తాగునీటి పాత్రలు ఏర్పాటు చేయాలి. ఆకలి, దాహంతో ఉన్న జంతువులకు తగిన ఆహారం అందించాలి.

● గాయపడిన, అనారోగ్యంతో ఉన్న జంతువులకు వెంటనే పశువైద్య చికిత్స అందించాలి. క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి.

● వీధి కుక్కలు, పిల్లుల కోసం స్టెరిలైజేషన్‌ కార్యక్రమాలను శాసీ్త్రయంగా నిర్వహించాలి.

● అడవులు, చెరువులు, గడ్డి భూములు వంటి జంతువుల సహజ ఆవాసాలను కాపాడాలి.

● అక్రమ వేట, అడవి జంతువుల అక్రమ రవాణాను అరికట్టాలి.

● జంతువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అడవి ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించాలి.

● ప్లాస్టిక్‌ వ్యర్థాలను జంతువులు తినకుండా చెత్తను సక్రమంగా నిర్వహించాలి.

● పాఠశాలలు, కళాశాలల్లో జంతు సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

● వన్యప్రాణుల అక్రమ వేట, వ్యాపారం, నివాస ప్రాంతాల విధ్వంసాన్ని నిరోధించాలి.

వన్యప్రాణులకు ఓరుగల్లు పుట్టినిల్లు

ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా అటవీప్రాంతం

దట్టమైన అడవులు. వాటిని ఆసరాగా చేసుకుని బతికే ప్రాణులు. ఇవే ప్రకృతి సమతుల్యతకు ప్రధానం. మానవాళి మనుగడ కొనసాగించాలన్నా.. భవిష్యత్‌ తరాలు ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలన్నా.. అడవులను, జంతువులను సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది. జంతుజాలానికి ఆలవాలమైన ఉమ్మడి వరంగల్‌ జిల్లా అడవులు వాటి సంరక్షణకు కేంద్రంగా నిలుస్తున్నాయి. నేడు (ఆదివారం) ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ స్పెషల్‌ స్టోరీ.

– ఏటూరునాగారం/

న్యూశాయంపేట/ఖానాపురం

● అనేక రకాల జంతువుల ఆవాసం

● వాటిని సంరక్షించుకుంటేనే

జీవవైవిధ్య సమతుల్యత

నేడు ప్రపంచ జంతు దినోత్సవం

ఖానాపురం: వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల అభయారణ్యం జంతువుల ఆవాసం, విడిదిగా మారింది. ఇక్కడ ఎలుగుబంట్లు, హైనాలు, నక్కలు, అడవి కుక్కలు (ధోల్స్‌) నివసిస్తున్నాయి. శాకాహారులైన చిటాల్‌ (మచ్చల జింక), సాంబార్‌, నీల్గాయ్‌, కృష్ణ జింక, నాలుగు కొమ్ముల జింకలు (చౌసింఘా), అడవి పందులు, సరీసృపాలు విరివిగా ఉన్నాయి. పాకాల సరస్సులో మగ్గర్‌ మొసళ్లు నివసిస్తాయి. ఈలకం బాతులు, మరికొన్ని కొంగలు వలస పక్షులు ఇలా మొత్తం 150 రకాల పక్షులున్నాయి. గతంలో బర్డ్‌వాక్‌లు నిర్వహించారు. తాజాగా.. ఈ అభయారణ్యంలో పరిశోధన శాస్త్రవేత్తలు కొత్త బల్లిజాతిని గుర్తించారు. హెమిడాక్టిలస్‌ కోయాఓరం అని దీనికి నామకరణం చేశారు.

జంతువులు, పక్షులు, సరీసృపాలు, ఇతర జీవులది పర్యావరణ వ్యవస్థలో ముఖ్య పాత్ర. వాటి మనుగడ కాపాడడడం ప్రతి ఒక్కరి బాధ్యత. అడవుల నరికివేత, వేట, అక్రమ రవాణా, అడవుల్లో మంటలు వంటి కారణాలతో అనేక వన్యజీవులు ప్రమాదంలో పడుతున్నాయి. వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడం, అడవులను కాపాడడం, అక్రమ వేటను అరికట్టడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా వాటి మనుగడకు తోడ్పడవచ్చు. ముఖ్యంగా అడవులకు సమీపంలో నివసించే ప్రజలు వన్యప్రాణులతో సహజీవనం చేస్తూ, వాటికి హాని కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ములుగు జిల్లా అడవుల్లో ఎలుగుబంటి, పిల్లి, అడవి పిల్లి, నాలుగు కొమ్ముల జింక, అడవి కుక్క, చుక్కల జింక, భారతీయ నక్క, అడవి దున్న, తోడేలు కుక్క, హైనా, నల్లమెడ కుందేలు, నక్క, చిరుతపులి, లంగూర్‌ కోతి, రీసస్‌ కోతి, ముంగీస, నీలగాయి, ముళ్లపంది, అలుగు, సాంబర్‌ జింక, పెద్ద ఉడుత, ఎగిరే ఉడుత, పులి, అడవి పంది ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

హనుమకొండ హంటర్‌ రోడ్డులోని కాకతీయ జూవాలాజికల్‌ పార్క్‌ సందర్శకులకు కనువిందునిస్తోంది. ఇక్కడ జంతువులు, పక్షులు, తామర కొలను ఆకట్టుకుంటోంది. చిరుత పులి, అడవిదున్నలు, ఎలుగుబంటి, నక్కలు, అడవి పిల్లి, చుక్కల దుప్పి, సాంబర్‌ దుప్పి, కొండగొర్రెలు, మూషిక జింకలు, మనుబోతు, కృష్ణ జింకలు మొసళ్లు, తాబేళ్లు, నక్షత్ర తాబేళ్లు, గ్రీన్‌ ఇంగ్వానా(తొండ) నాలుగు రకాల సరీసృపాలు, నిప్పుకోడి, రియా, నెమళ్లు, నలుపు, తెలుపు హంసలు, రామచిలుక, లవ్‌ బర్డ్స్‌ వంటి 26 రకాల పక్షులున్నాయి. సందర్శకులకు కనువిందు చేయడానికి పెద్దపులులను తీసుకొచ్చినా వాటిలో ఒకటి చనిపోయింది. మరొకటి అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్‌ జూపార్క్‌కు తరలించారు. కొత్తగా హాగ్‌డీర్‌, బార్కింగ్‌డీర్‌, (దక్షిణ ఎరుపురంగు జింకలు) లుటినో పార్కిట్‌ (పసుపురంగు రామచిలుక)లు అందుబాటులో ఉన్నాయి.

తోడుకోసం ఏటా పులి ప్రయాణం..

టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఉన్నా.. పులుల ఆవాసం ఉండడం లేదు. ప్రతీ ఏడాది మేటింగ్‌ సమయంలో సిర్పూరు నుంచి పులులు గోదావరి మీదుగా భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంటాయి. ఆడగానీ, మగతోడు కానీ దొరక్కపోవడంతో ఉమ్మడి జిల్లాలోని అటవీ ప్రాంతాలగుండా సంచరించి తిరిగి సొంత ప్రాంతానికి వెళ్తున్నాయి. 2021 డిసెంబర్‌లో మగపులి ఎస్‌–8, 2020 నవంబర్‌లో కూడా ఎం(ములుగు)–1 పులి కూడా సంచరించింది. గతేడాది కూడా ములుగు, భూపాలపల్లి జిల్లాలో పులి కలకలం రేపింది. ఇలా ప్రతీ ఏటా ఆడ, మగపులి జిల్లాకు వచ్చి వెళ్లిపోతున్నాయి.

వీధికుక్కల సంరక్షణ కరువు

సాధారణంగా వీధికుక్కలకు ప్రత్యేకంగా సంరక్షణ ఉండడం లేదు. ఇవి ఆహారం దొరక్క ప్రజలను కరుస్తున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఇటీవల సుప్రీంకోర్టు వీధికుక్కలను జనావాసాలకు దూరంగా తరలించి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతోపాటు ప్రత్యేకంగా ఫుడ్‌కోర్టులను ఏర్పాటుచేయాలని స్పష్టం చేసింది. అయినా వాటిని పట్టించుకునే వారు కరువయ్యారు.

అటవీ శాఖ అధికారుల ప్రత్యేక దృష్టి..

అటవీశాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని అడవుల్లో సుమారు 169 కెమెరాలను అమర్చారు. వన్యప్రాణుల కదలికలను కెమెరాల్లో బంధించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిత్యం గూడేల్లో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేస్తూ వేటాడే వస్తువులు, ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు.

సందర్శకులకు కనువిందు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement