హసన్‌పర్తి: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే రీసర్వే చేస్తున్నట్లు తహసీల్దార్ కిరణ్‌కుమార్ తెలిపారు. వందేళ్ల తర్వాత భూముల రీసర్వే చేపడుతున్నట్లు చెప్పారు. హసన్‌పర్తి మండలం జయగిరి, లక్నవరం శివారుల్లో చేపట్టిన భూభారతి రీసర్వే ప్రాంతాన్ని ఏడీ నూర్‌సింగ్, తహసీల్దార్ కిరణ్‌కుమార్ శనివారం సందర్శించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా అందించాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మ్యాప్‌ను పరిశీలించి అనంతరం వారు మాట్లాడారు. ప్రతీ భూమికి భూఆధార్ నంబర్ కేటాయించి, ఎల్పీఎం ద్వారా వివరాలను ఆన్‌లైన్‌లో పొందపర్చనున్నట్లు వివరించారు. సర్వే జరుగుతున్నప్పుడు రైతులు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


