కేయూ క్యాంపస్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం సాంకేతిక పరిజ్ఞానమే సరిపోదని, మహీంద్రా ప్రైడ్ క్లాస్‌రూమ్ వంటి వర్క్‌షాప్‌లు విద్యార్థులకు ఎంతో అవసరమని కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రమణ అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ (టాస్క్) సహకారంతో వారం రోజులపాటు నిర్వహించే వర్క్‌షాప్‌ను కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్క్‌షాప్‌లో శిక్షణ తరగతులను ప్రముఖ వెర్చల్ ఎబిలిటీ అండ్ సాఫ్ట్‌స్కిల్స్ ట్రైనర్ థామస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ లక్ష్మణ్‌నాయక్, డాక్టర్ సంతోష్‌కుమార్ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు.


