కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే క్యారియజ్ అండ్ వ్యాగన్ (సీడబ్ల్యూ) డిపో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బి.రాంబాబును రైల్వే అధికారులు, కార్మికులు శనివారం సన్మానించారు. రాంబాబుకు సికింద్రాబాద్ కోచింగ్ డిపో ఆఫీసర్ (సీడీఓ)గా పదోన్నతి కల్పిస్తూ సికింద్రాబాద్ రైల్వే అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు రాంబాబును సన్మానించి ఆయన సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో కాజీపేట స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, ఎస్‌ఎస్‌ఈ తుమ్మ రాజ్‌కుమార్‌రెడ్డి, డోర్నకల్ ఎస్‌ఎస్‌ఈ బాబు, రామగుండం ఎస్‌ఎస్‌ఈ కొర్ర పాండ్, ఎస్‌ఎస్‌ఈ యమునాకర్‌రెడ్డి, కాజీపేట సీసీఐ రాజ్‌గోపాల్, అన్ని విభాగాల సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.


