నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

Oct 4 2026 11:07 AM | Updated on Oct 4 2026 11:07 AM

నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు రేపటి నుంచి అంతర్‌ కళాశాలల క్రీడాపోటీలు ‘మాసూమ్‌ అలీ’ ఎఫ్‌ఏసీ హెచ్‌ఎంగా శ్రీధరాచార్యులు అలైన్‌మెంట్‌ మార్చాలని ఆందోళన సైనిక్‌ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు ‘ముఖ్యమంత్రికి సామాజిక న్యాయంపై నమ్మకం లేదు’ మాజీ కార్పొరేటర్‌ శేఖర్‌ మృతి

హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు ఆదివారం అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ టౌన్‌ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. దత్తపురం, కేఎస్‌ఆర్‌ గార్డెన్స్‌, అమ్రోస్‌ వాటర్‌ ప్లాంట్‌, హనుమాన్‌ జంక్షన్‌ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలీపుర, కనకదుర్గ కాలనీ, ఎకై ్సజ్‌ కాలనీ, కేఎల్‌ఎన్‌ రెడ్డి కాలనీ, పోలీసు స్టేషన్‌ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హసన్‌పర్తి: ఈనెల 5నుంచి 7వ తేదీ వరకు అంతర్‌ కళాశాలల క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు కిట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అశోక్‌రెడ్డి తెలిపారు. కిట్స్‌ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, వాలీబాల్‌ పోటీలు జరుగుతాయని వివరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ప్రతాప్‌రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.

కాళోజీ సెంటర్‌: వరంగల్‌ మాసూమ్‌అలీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు సబ్జెక్టు స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టి.శ్రీధరాచార్యులును అదే పాఠశాలకు ఎఫ్‌ఏసీ హెచ్‌ఎంగా నియమిస్తూ డీఈఓ రంగయ్య నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ఉత్తర్వులు అందుకున్న శ్రీధరాచార్యులు శనివారం బాధ్యతలు స్వీరించారు. గతంలో హెచ్‌ఎంగా పనిచేసిన తుమ్మ జయబాలరెడ్డి సెప్టెంబర్‌ 30న ఉద్యోగ విరమణ చేయడంతో ఆస్థానంలో శ్రీధరాచార్యులును నియమించారు. ఈ మేరకు ఆయనకు ఉపాధ్యాయులు కమలాకర్‌, ఆడెపు భిక్షపతి, కూస దేవేందర్‌, అల్లోజు కిషన్‌, సాయబోయిన మోహన్‌, ట్రైనీ టీచర్లు శుభాకాంక్షలు తెలిపారు.

హసన్‌పరి: హనుమకొండ – దేవన్నపేట మార్గమధ్యలోని కోమటిపల్లి గేట్‌ వద్ద నిర్మించనున్న బ్రిడ్జిని మరో ప్రాంతానికి మార్చాలని భూ నిర్వాసితులు కోరారు. ఈ మేరకు కోమటిపల్లి గేట్‌ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. వంతెన నిర్మాణం వల్ల తాము ఇళ్లు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అలైన్‌మెంట్‌లో తగు మార్పులు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

కేయూ క్యాంపస్‌: న్యూఢిల్లీలో ఇటీవల నిర్వహించిన ఆల్‌ ఇండియా థల్‌సైనిక్‌ క్యాంపులో పాల్గొన్న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల విద్యార్థులు అఖిల్‌, లోకేష్‌ను ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జ్యోతి, అధ్యాపకులు కళాశాలలో శనివారం అభినందించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రెహమాన్‌, ఎన్‌సీసీ అధికారి డాక్టర్‌ స్వామి, ఎన్‌సీసీ సిబ్బంది పాల్గొన్నారు.

హన్మకొండ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సామాజిక న్యాయంపై నమ్మకం లేదని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ తిరుణహరి శేషు అన్నారు. రాష్ట్ర విధానసభ, రాష్ట్ర విధాన మండలిలో ఒక జాతీయ పార్టీ బలహీన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో వైఫల్యం చెందడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. విధాన మండలిలో 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే బీసీల ప్రాతినిధ్యం కేవలం 11కు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో నల్లగొండ పట్టభద్రుల సిట్టింగ్‌ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదని తిరుణహరి శేషు పేర్కొన్నారు.

హన్మకొండ చౌరస్తా: ప్రమాదవశాత్తు మెట్ల పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన మాజీ కార్పొరేటర్‌ కానుగంటి శేఖర్‌ (63) ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందారు. ఈ మేరకు ఆస్పత్రి వద్ద శేఖర్‌ మృదేహానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement