రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Oct 4 2026 11:07 AM | Updated on Oct 4 2026 11:07 AM

● ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

కాజీపేట అర్బన్‌: రూ.2.60 కోట్ల నిధులతో గ్రేటర్‌ వరంగల్‌ 31వ డివిజన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టినట్లు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. డివిజన్‌ పరిధిలోని అవంతి స్కూల్‌ కాలనీ, హంటర్‌ రోడ్డు విశాల్‌మార్ట్‌ ప్రాంతం, సూర్యోదయ కాలనీ, శ్రీరామ్‌ హిల్స్‌, హంటర్‌ హిల్స్‌రోడ్డు నంబర్‌ –3 ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ డివిజన్‌లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ మెంబర్‌ బత్తిని శ్రీనివాస్‌రావు, డివిజన్‌ ఇన్‌చార్జ్‌ మార్క విజయ్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌ మామిండ్ల రాజు, వేల్పుల మోహన్‌రావు, డీసీసీ సభ్యుడు మామిండ్ల సురేష్‌, నాయకులు సత్తు రమేష్‌, సురేందర్‌, వేణు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జనావాసాల్లో మురుగునీరా?

జనావాసాల్లో మురుగునీరు నిలవడం ఏంటని అధికారులను ఎమ్మెల్యే నాయిని ప్రశ్నించారు. 31వ డివిజన్‌ పరిధిలోని అవంతి స్కూల్‌ కాలనీలో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో మురుగు నీటి కుంటను ఆయన పరిశీలించారు. తక్షణమే ప్లాట్‌ యజమానులకు నోటీసులు అందజేసి, మొరం పోసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమస్యల పరిష్కారానికి కృషి

హన్మకొండ: నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అన్నారు. 59వ డివిజన్‌ పరిధి హనుమకొండలోని అలీపురలో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి శనివారం పర్యటించారు. స్థానికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముస్లిం కమ్యూనిటీ హాల్‌ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఈవీ శ్రీనివాస్‌ రావు, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్‌ రావు, స్థానిక నాయకులు నబీన్‌, మజార్‌, తేళ్ల కిశోర్‌, తేళ్ల సుగుణ, శృతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement