● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్
ఖిలా వరంగల్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ విమర్శించారు. వరంగల్ మామునూరు శివారులోని హెచ్‌ఆర్‌ఎస్ గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్ పార్టీ యువనేత అరూరి విశాల్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటరు నమోదు ప్రక్రియపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రమేష్ హాజరై మాట్లాడుతూ 30వేల ఉద్యోగాలు కల్పించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలను కూడా తన ఖాతాలోనే వేసుకుంటోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఇంకా రెండేళ్ల అధికారం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను బలవంతంగా నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.


