చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Oct 4 2026 11:07 AM | Updated on Oct 4 2026 11:07 AM

హన్మకొండ అర్బన్‌: ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సఖి లీగల్‌ అడ్వైజర్‌ శ్రీదేవి, సూపర్‌వైజర్‌ ఝాన్సీ అన్నారు. సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, సర్వోదయ యూత్‌ ఆర్గనైజేషన్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూలైవాడలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. సఖి సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు ఐదు రకాల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఉచిత కౌన్సెలింగ్‌, న్యాయం, వైద్యం, పోలీస్‌ సహాయం, తాత్కాలిక వసతి కల్పించనున్నట్లు వివరించారు. సఖి కేంద్రం 24 గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు. సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు 181 మహిళా హెల్ప్‌లైన్‌, 1098 చైల్డ్‌లైన్‌, 0870 – 2452112, 73829 83088 నంబర్లకు ఫోన్‌ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. అనంతరం, సఖి సేవల కరపత్రాలను ఆవిష్కరించారు. సదస్సులో కేస్‌ వర్కర్‌ అనూష, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement