శిల్పకళా వైభవానికి ప్రతీక ‘వేయిస్తంభాల దేవాలయం’ | - | Sakshi
Sakshi News home page

శిల్పకళా వైభవానికి ప్రతీక ‘వేయిస్తంభాల దేవాలయం’

Oct 4 2026 11:07 AM | Updated on Oct 4 2026 11:07 AM

● కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థుల నిర్మాణ కళాప్రదర్శన

హన్మకొండ కల్చరల్‌: కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన వరంగల్‌ నగరంలోని వేయిస్తంభాల దేవాలయం విద్యార్థుల నిర్మాణ కళాప్రదర్శనకు వేదికై ంది. శనివారం విజయవాడలోని కేఎల్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ విద్యార్థులు ఆలయాన్ని సందర్శించి నిర్మాణశైలి, శిల్పసంపదపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆలయప్రాంగణంలో ఆర్కిటెక్చరల్‌ షీట్లు, నమూనాలు, డాక్యుమెంటేషన్‌ డ్రాయింగ్స్‌ ప్రదర్శించారు. ఆలయ విశిష్టతను ప్రతిబింబించేలా ఫొటోగ్రఫీ, లైవ్‌ స్కెచ్చింగ్‌ నిర్వహించారు. అశోకా స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ విద్యార్ధులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కళాత్మక నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనను ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.

‘ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌

ఉంటేనే విద్యుత్‌ కనెక్షన్‌’

హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ పరిధిలో పది మీటర్లకుపైగా ఎత్తు ఉన్న భవనాలకు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌, కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు చేయనున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ టౌన్‌ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. రిటైల్‌ సప్‌లై టారిఫ్‌, సంబంధిత నిబంధన ప్రకారం 10 మీటర్లకుపైగా ఎత్తు ఉన్న భవనాలకు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి జారీ చేసిన సర్టిఫికెట్‌, కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ విద్యుత్‌ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. నిర్దేశించిన విద్యుత్‌ చార్జీలు చెల్లించిన తర్వాతే విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవన యజమానులు, బిల్డర్లు, అపార్ట్‌మెంట్‌ నిర్మాణదారులు శాశ్వత విద్యుత్‌ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకునే ముందు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా అందించాలని సూచించారు.

శంకరయ్యపై సస్పెన్షన్‌ వేటు ఉత్తర్వులు జారీ

కేయూ క్యాంపస్‌ : హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ కళాశాలలోని తెలుగు విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.శంకరయ్యను సస్పెండ్‌ చేస్తూ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు శనివారం ఆయా సస్పెన్షన్‌ ఉత్తర్వుల రెండు కాపీల్లో ఒకటి ప్రిన్సిపాల్‌ జ్యోతికి, మరొకటి శంకరయ్య పంపారు. ఆయన పీడీఎఫ్‌ కింద తీసుకున్న రూ 6,89,400 తిరిగి యూజీసీకి చెల్లించాల్సి ఉండగా రూ.2లక్షలు మాత్రమే చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లించటంలో జాప్యం చేస్తూ వస్తున్నారు. దశలవారీగా చెల్లిస్తానని షోకాజ్‌ నోటీస్‌లకు వివరణలు ఇచ్చిన ఆయన తరువాత మాటమార్చడంతో సస్పెన్షన్‌ చేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని సమాచారం. ఈ వ్యవహారం పై యూజీసీకి కూడా ఫిర్యాదు అందటంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నానరేది తెలపాలని యూనివర్సిటీకి లేఖ అందినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement