హన్మకొండ: చెత్త, వ్యర్థాలను బల్దియా తరలించలేక ఎక్కడికక్కడే తగలబెడుతుండడంతో నగరం పొగతో నిండిపోతోంది. శుక్రవారం హనుమకొండలోని గోకుల్ కూడలి (తిరుమల బార్) కూడలి నుంచి సుబేదారి వెళ్లే 80 ఫీట్ల రోడ్డులో కల్యాణి ఫంక్షన్ హాల్ సమీపంలో చెట్ల కొమ్మలు కత్తిరించారు. వాటిని తరలించకుండా నిప్పు పెట్టారు. దీంతో ఈ ప్రాంతమంతా పొగతో కమ్ముకుపోయింది. మంటలు ఆరిన తర్వాత బూడిద గాల్లోకి కలిసి సమీప ఇళ్లల్లోకి చేరింది. గాల్లో కలుస్తున్న బూడిదతో వాహనదారులు, స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.


