హన్మకొండ కల్చరల్: దసరా పండుగ నాటికి భద్రకాళి అమ్మవారి రథాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు వేగవంతం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న మాడవీధులు, సుమారు కోటి రూపాయలతో తయారు చేస్తున్న అమ్మవారి రథం పనులు, ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శరన్నవరాత్ర మహోత్సవాలు, దసరా ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. కార్యక్రమంలో కుడా అధికారులు అజిత్‌రెడ్డి, భీమ్‌రావు, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ఈఓ రామల సునీత, అర్చకులు రాముశర్మ, దారుశిల్పి ప్రవీణ్‌చారి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్ చాహత్


