● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాళోజీ సెంటర్: మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ఉపాధి అవకాశాలు కల్పించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో రాణి రుద్రమదేవి జిల్లా సమాఖ్య 12వ వార్షికోత్సవంలో కలెక్టర్ సత్యశారద మాట్లాడారు. జిల్లాలోని 11 మండలాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొబైల్ సూపర్ మార్కెట్లు, జిరాక్స్ కేంద్రాలు, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు, పప్పు మిల్లులు ఏర్పాటు చేయాలని సూచించారు. మంజూరైన గ్రామ సంఘ భవనాల నిర్మాణాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి ‘వరంగల్ జిల్లా బ్రాండ్’ గుర్తింపు తీసుకురావాలని తెలిపారు. డీఆర్‌డీఓ నాగపద్మజ మాట్లాడుతూ మహిళా సంఘాలకు జీవనోపాధి కల్పించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, కార్యదర్శి ఉమ, కోశాధికారి స్వప్న, అదనపు డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీపీఎం అనిల్‌కుమార్, ఏపీఎంలు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


