పీడీఎస్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Oct 1 2026 9:33 AM | Updated on Oct 1 2026 9:33 AM

● రవాణాదారుల అరెస్ట్‌

కాశిబుగ్గ/వరంగల్‌ చౌరస్తా: మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి, విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించి, కొల్లేటి వేణుగోపాల్‌ను అదుపులో తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వేణుగోపాల్‌ నర్సంపేటలోని రోహిణి ఇండస్ట్రీస్‌కు చెందిన జైపాల్‌రెడ్డి, కరీమాబాద్‌ విశ్వేశ్వర రైస్‌మిల్‌కు చెందిన ఎరుకుల్ల రమేశ్‌తో కలిసి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు పీడీఎస్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొని, వాటిని వరంగల్‌కు తరలించి, జేఎస్‌ఆర్‌ పేరుతో ఉన్న బస్తాల్లో ప్యాక్‌ చేసి, మార్కెట్‌లో విక్రయిస్తూ సాధారణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందం 26 కిలోల చొప్పున 257 బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 64 క్వింటాళ్ల బియ్యం విలువ రూ.3,87,556 ఉంటుందని వివరించారు. కాగా, అదుపులో తీసుకున్న నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మట్టెవాడ పోలీసులకు అప్పగించారు. అదుపులో తీసుకున్నవారిలో కొల్లేటి వేణుగోపాల్‌, పరారీలో ఉన్న నిందితుల్లో జైపాల్‌రెడ్డి, ఎరుకుల్ల రమేశ్‌ ఉన్నారు. దాడుల్లో ఏసీపీ ఎ.మధుసూదన్‌, ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీధర్‌, ఎస్‌ఐ టి.వీరస్వామి పాల్గొన్నారు.

26.7 క్వింటాళ్లు..

వరంగల్‌ ఇంతేజార్‌ గంజ్‌ పరిధి కొడూరు జ్ఞానేశ్వర్‌, చెన్నారావు పేట మండలం కొనాపురం గాయత్రి రైస్‌ మిల్‌ యజమాని కుసుమ రవితో కుమ్మకై ్క సబ్సిడీ పీడీఎస్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. జ్ఞానేశ్వర్‌ వద్ద 26 కిలోల చొప్పున 95 బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం బియ్యం 2,470 కిలోలు (24.70 క్వింటాళ్లు), దీని విలువ సుమారు రూ. 86,450 ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని బియ్యంతోపాటు ఇంతేజార్‌గంజ్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. దాడుల్లో మధుసూదన్‌, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌, సీఐ శ్రీధర్‌, ఎస్‌ఈ వీరస్వామి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement