పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు నిర్వహించండి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు నిర్వహించండి

Oct 1 2026 9:33 AM | Updated on Oct 1 2026 9:33 AM

పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు నిర్వహించండి

● హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవితో కలిసి పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో పత్తి సాగు, అంచనా దిగుబడి, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్‌ అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. పత్తికి క్వింటాకు రూ.8,667 మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జిల్లాలో 75,747 ఎకరాల్లో పత్తి సాగు కాగా, 6,81,723 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా సీసీఐ అధికారులు త్వరగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంఓ అనురాధ, ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, విద్యుత్‌, వ్యవసాయ, రవాణా, మార్కెట్‌ కమిటీ, లీగల్‌ మెట్రాలజీ, అగ్నిమాపక శాఖల అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

వృద్ధాశ్రమాల్లో వసతులు మెరుగ్గా ఉండాలి

సేవా దృక్పథంతో నిర్వహించే వృద్ధాశ్రమాల్లో వసతులు మెరుగ్గా ఉండాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పది వృద్ధాశ్రమాల్లో సెప్టెంబర్‌ 25 నుంచి 30 వరకు నిర్వహించిన తనిఖీలపై అధికారులతో, వృద్ధాశ్రమాల నిర్వాహకులతో బుధవారం కలెక్టరేట్‌లో ఆమె సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.విశ్వజ, సీడీపీఓలు వి.సింధురాణి, సీహెచ్‌.అవంతి, కె.స్వాతి, ఇన్‌చార్జ్‌ డీసీపీఓ ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, ఎఫ్‌ఆర్‌ఓలు రవికృష్ణ, రాజేశ్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌న్‌ కో–ఆర్డినేటర్‌ ఎస్‌.భాస్కర్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు ఝాన్సీ, పద్మ, వృద్ధాశ్రమాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement