రైల్వే లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రైల్వే లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలి

Oct 1 2026 9:33 AM | Updated on Oct 1 2026 9:33 AM

● ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ జనరల్‌ సెక్రటరీ రాఘవయ్య

కాజీపేట రూరల్‌: కేంద్రం రైల్వే లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించి వారికి, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ జనరల్‌ సెక్రటరీ, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం.రాఘవయ్య డిమాండ్‌ చేశారు. లోకో పైలెట్ల సమస్యలపై రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కాజీపేట రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన లోకో సమ్మెట్‌కి జనరల్‌ సెక్రటరీ రాఘవయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటుకు కావాల్సిన ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపిస్తానన్నారు. లోకోపైలెట్ల సమస్యలు తెలుసుకోవడానికి తాను ఢిల్లీ నుంచి కాజీపేటకు వచ్చానని తెలిపారు. వరంగల్‌లో క్రూ డిపో, కాజీపేటను రైల్వే డివిజన్‌గా చే యాలని రన్నింగ్‌స్టాఫ్‌ తమ ముందుకు తీసుకొచ్చిందని వాటికి రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ నుంచి పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ భరణి భానుప్రసాద్‌, రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు కొత్త మురళీకృష్ణ, ప్రభురాజ్‌, జోనల్‌ సెక్రటరీ కేవీఆర్‌ ప్రసాద్‌, రామకృష్ణ, దిలీప్‌, మహాలక్ష్మి, వేగి మురళీకృష్ణ, సీవీపీ రాజు, వెంకటనారాయణ, మధుసూదన్‌రావు, పాక రాజ్‌కుమార్‌, చైర్మన్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement