వరంగల్ స్పోర్ట్స్: పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14, 17 బాలబాలికల విభాగంలో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి పుల్ల అనిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌లోని ఓ సిటీ మైదానంలో యోగా, ఫెన్సింగ్ ఎంపికలు, ఖమ్మం బైపాస్ రోడ్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో హాకీ ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఎంపికలకు హాజరు కావాలని తెలిపారు. క్రీడాకారులు తమ వెంట ఆధార్ కార్డు, స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్, గత సంవత్సర ప్రోగ్రెస్ కార్డు, పుట్టినతేదీ సర్టిఫికెట్ లను తీసుకువాలని తెలిపారు.
ఏఏఏ రాష్ట్ర అధ్యక్షుడిగా నవీన్
విద్యారణ్యపురి: గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏఏఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా నైనాల నవీన్ ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం.డీ సులేమాన్ ఎన్నికై నట్లు సంబంధిత సంఘం నాయకులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం నవీన్ ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన హనుమకొండ జిల్లాకు చెందినవారు.
నిట్‌లో ‘కాన్‌క్లేవ్–26’
కాజీపేట అర్బన్: నిట్ పూర్వ విద్యార్థులు డిసెంబర్ 19, 20వ తేదీల్లో గ్లోబల్ ఎంట్రీపెన్యూర్‌షిప్ కాన్‌క్లేవ్–26ను నిర్వహించనున్నారు. నూతన ఐడియాలకు ఆవిష్కరణ రూపం, స్టార్టప్ కల్చర్ కల్పించే వేదికగా నిలవనున్న కాన్‌క్లేవ్‌లో నిట్ పూర్వ విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు తదితరులు పాల్గొననున్నట్లు సమాచారం. ఔత్సాహికులు కాన్‌క్లేవ్‌లో పాల్గొనేందుకు www. nitwgec.comల ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.
అలరించిన మ్యూజికల్ నైట్
కాజీపేట అర్బన్: నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో మంగళవారం రాత్రి స్పిక్‌మెకే క్లబ్ నిర్వహించిన మ్యూజికల్ నైట్ అలరించింది. శాసీ్త్రయ సంగీత గాయకుడు ఓంకార్ దాదర్కర్ గీతాలు ఆలపించారు. నేటి తరానికి శాసీ్త్రయ సంగీతాన్ని అందించేందుకు స్పిక్‌మెకే మ్యూజికల్ నైట్ నిర్వహించినట్లు డీన్ కిరణ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సునీల్‌కుమార్ మెహతా, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌పీవీ టీకాతో కేన్సర్‌కు చెక్
● వరంగల్ డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి
ఖిలా వరంగల్: హెచ్‌పీవీ టీకాతో కేన్సర్‌కు చెక్ పడుతుందని వరంగల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రాజారెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ ఉర్సు గుట్టలోని ఎంజేపీటీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఆర్‌తోట పీహెచ్‌సీ సిబ్బంది హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎంహెచ్‌ఓ హాజరై వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కిశోర బాలికల ఆరోగ్య పరిరక్షణలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కీలకమన్నారు. 14–15 ఏళ్ల విద్యార్థులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం 51 మంది విద్యార్థినులకు టీకా వేసి హెచ్‌పీవీ ప్రాముఖ్యత, ప్రయోజనాలు, గర్భాశయ ముఖ ద్వారా కేన్సర్ నివారణలో టీకా పాత్రపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్‌జోషి, పీఓ డాక్టర్ అనిత, ప్రిన్సిపాల్ అంజిరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


