‘తూర్పు’ అభివృద్ధికి సమయం కేటాయిస్తా | - | Sakshi
Sakshi News home page

‘తూర్పు’ అభివృద్ధికి సమయం కేటాయిస్తా

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

సాక్షి, వరంగల్‌/కాశీబుగ్గ: తనకు మంత్రి పదవి పోయిందన్న బాధ లేదని, పై అధికారులతో ఇప్పటికి సంబంధాలున్నాయని, గతంలో రాష్ట్రస్థాయి అభివృద్ధి కోసం పనులు చేశానని, ఇప్పుడు నియోజవర్గ అభివృద్ధికి అధిక సమయం కేటాయించి పనిచేస్తానని మాజీ మంత్రి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. వరంగల్‌ ఓ సిటీలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో 111 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంగళవారం ఆమె పంపిణీ చేశారు. అనంతరం సురేఖ మీడియాతో మాట్లాడారు. ప్రతీ వారంలో ఒక రోజు ఒక డివిజన్‌ చొప్పున పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 24డివిజన్లను గెలుచుకుంటామని ఽధీమా వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ నిర్మాణం చేసుకున్నామని, ఇక్కడ తగిన ఫర్నిచర్‌ ఏర్పాటు చేసుకోవడం, కాంట్రాక్టర్‌కు బిల్లు పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రారంభంలో జాప్యమవుతోందన్నారు. త్వరలోనే సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ భవనం ప్రారంభం చేసుకుంటామని, బస్‌ స్టేషన్‌ కూడా త్వరగా పూర్తి కావడానికి కృషి చేస్తానని తెలిపారు. ఎంజీఎంపై బీఆర్‌ఎస్‌ వాళ్లు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, వాళ్లే తొక్కిసలాట చేసుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్‌లో దేవాలయాల అభివృద్ధికి బీజేపీ నాయకులు ఎందుకు కేంద్రంనుంచి నిధులు తీసుకురావడం లేదని విమర్శించారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మీసాల ప్రకాశ్‌, రాష్ట్ర నాయకుడు గోపాల నవీన్‌రాజుతోపాటు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

మాజీ మంత్రి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement