గడువులోగా సీఎంఆర్‌ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా సీఎంఆర్‌ పూర్తి చేయాలి

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

గడువులోగా సీఎంఆర్‌ పూర్తి చేయాలి

● హనుమకొండ అదనపు కలెక్టర్‌ రవి

హన్మకొండ అర్బన్‌ : నిర్దేశిత గడువులోగా సీఎంఆర్‌ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ రవి ఆదేశించారు. సీఎంఆర్‌ అందజేతపై పౌరసరఫరాల శా ఖ అధికారులు, రైస్‌ మిల్లర్లతో మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎఫ్‌ సీఐ, పౌరసరఫరాల సంస్థలకు చేరవేయాల్సిన కస్ట మ్‌ మిల్లింగ్‌ బియ్యం డెలివరీ లెక్కలను సమీక్షించా రు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాల ను పాటిస్తూ గడువులోగా సీఎంఆర్‌ డెలివరీ పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు సరఫరా చేసిన బి య్యం నిల్వలు, మిగిలిన కోటా లెక్కలను పక్కాగా సరిచూసుకుని ప్రక్రియను వేగవంతం చేయాలన్నా రు. జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ మహేందర్‌ డీటీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగాలి

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగాలని హ నుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో 65 ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సీసీలు, ఏపీఎంలతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి మాట్లాడు తూ ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 24 గంటల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవా లన్నారు. అక్టోబర్‌ 5వ తేదీలోగా అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, ట్యాబ్‌ ఎంట్రీలను ప్రతిరోజూ 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పౌరసరఫరాల అధికారి మహేందర్‌, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌చంద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement