● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
కాజీపేట అర్బన్: గ్రాండ్ పేరెంట్స్‌ను గౌరవించుకో వాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. న్యూశాయంపేటలోని పోచంపల్లి ప్ర భుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించా రు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ మ్మ, నానమ్మ, తాతయ్యల మాటలు, వారి సూక్తులు పాటిస్తే ఉన్నతస్థాయి చేరుకుంటారన్నారు. డీఈఓ గిరిరాజ్‌గౌడ్, ఎంఈఓ మనోజ్‌కుమార్, జీసీడీఓ సునీత, ఏసీడీపీఓ సుంధురాణి పాల్గొన్నా రు. పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడీని సందర్శించిన కలెక్టర్.. చిన్నారులకు ఉగ్గు పట్టించి, గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు.
వీఓ భవనాల పనులు వేగవంతం చేయాలి
జిల్లాలో వీఓ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారుల ను ఆదేశించారు. వీఓ భవనాలు, రుణాల వసూళ్లు, మహిళా డెయిరీ తదితర అంశాలపై డీఆర్డీఏ, సెర్ప్, సీ్త్రనిధి అధికారులతో కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, అదనపు డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీపీఎంలు రాజేంద్రప్రసాద్, సరిత, పద్మప్రియ, అనిత, దయాకర్, సీ్త్రనిధి ఆర్‌ఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


