హన్మకొండ అర్బన్: మహానగరంలో యూజీడీ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించేందుకు చర్యలు చేపడతామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి సీడీఎంఏ డాక్టర్ టీకే శ్రీదేవి వీడియో కాన్ఫరెన్‌్స్ ద్వారా ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, టెండర్ ప్రక్రియ, పనులు చేపట్టే విధానంపై బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీడీఎంఏ మాట్లాడుతూ డీపీఆర్‌కు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా క్రోడీకరించి, 15 రోజుల్లోగా టెండర్ పూర్తి చేసి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రేటర్ కమిషనర్ టి.వెంకన్న, ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ రవికుమార్, సీపీఓ రవీంద్ర రాడేకర్, అధికారులు పాల్గొన్నారు.


