గ్రేటర్‌ వరంగల్‌లో నెలకు యూపీఐపై కొత్త ‘చార్జీ’మోత | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ వరంగల్‌లో నెలకు యూపీఐపై కొత్త ‘చార్జీ’మోత

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

గ్రేటర్‌లో నెలకు రూ.కోటి మేర యూపీఐ లావాదేవీలు..?

రూ.2వేల వరకు ఉన్న పీ2ఎం యూపీఐ చెల్లింపులకు ఎండీఆర్‌ ఉండదు. అలాగే వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ బదిలీలకు మొత్తంతో సంబంధం లేకుండా ఈ ఎండీఆర్‌ వర్తించదు. క్యూఆర్‌ ద్వారా నెలకు రూ.లక్ష వరకు స్వీకరించే చిన్న వ్యాపారులకు కూడా ప్రత్యేక మినహాయింపు ఉంది. కాగా సాధారణ వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్‌ ఉండగా.. కొన్ని సేవలకు ప్రత్యేకంగా రూ.5ల ఫ్లాట్‌ ఎండీఆర్‌ విధానం ఉంటుంది. ఇందులో ప్రధానంగా.. విద్యుత్తు బిల్లులు, నీటి బిల్లులు, పైప్డ్‌ గ్యాస్‌, టెలికాం చెల్లింపులు, రైల్వే టికెట్లు, ఇంధనం, బీమా ప్రీమియంలు, కొన్ని ప్రభుత్వ/అవసర సేవలు ఉన్నాయి. రూ.2వేలు దాటిన అర్హత కలిగిన చెల్లింపులపై ఈ విభాగాల్లో ఒక్కో లావాదేవీకి రూ.5 ఫ్లాట్‌ ఎండీఆర్‌ వర్తిస్తుంది. కాగా వినియోగదారుడి యూపీఐ ఖాతా నుంచి నేరుగా ఎండీఆర్‌ కట్‌ చేయకూడదు. బ్యాంకులు, సిస్టమ్‌ ప్రొవైడర్లు ఎండీఆర్‌ భారాన్ని వినియోగదారుడిపై మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇది కచ్చితంగా అమలయ్యేలా చూడాలని వివిధ వర్గాల ప్రజలు కోరుతున్నారు.

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) గణాంకాల ప్రకారం హనుమకొండ, వరంగల్‌, కాజీపేట ట్రైసిటీల్లో నెలకు సుమారు రూ.కోటి నుంచి 1.2 కోట్ల వరకు యూపీఐ లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనా. వీటి మొత్తం విలువ రూ.1,400–రూ.1,700 కోట్ల పరిధిలో ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో వ్యక్తి నుంచి వ్యక్తికి (పర్సన్‌ టు పర్సన్‌ (పీ2పీ))జరిగే చెల్లింపులు కూడా ఉంటాయి. కొత్త ఎండీఆర్‌ ప్రధానంగా వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే పర్సన్‌ టు మర్చంట్‌ (పీ2ఎం) చెల్లింపులకే వర్తిస్తుంది. పీ2పీ లావాదేవీలు మొత్తంగా ఈ ఎండీఆర్‌ నుంచి మినహాయింపులోనే ఉంటాయి.

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

నెలాఖరులో జీతం వచ్చేలోపే ఇంటి బడ్జెట్‌ తడిసిమోపెడవుతోంది. ఇంటి అద్దె.. కరెంట్‌ బిల్లు.. నీటి బిల్లు.. గ్యాస్‌.. పిల్లల స్కూల్‌, కాలేజీ ఫీజులు.. పాలు.. కిరాణా సరుకులు.. పెట్రోల్‌.. మొబైల్‌, ఇంటర్నెట్‌.. బీమా ప్రీమియం.. ఇలా ఒక్కో ఖర్చు కలుస్తూ మధ్యతరగతి కుటుంబాలపై భారాన్ని పెంచుతోంది. ఇలాంటి సమయంలో డిజిటల్‌ చెల్లింపులపై కేంద్రప్రభుత్వం కొత్తగా మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) విధానం తెరపైకి వచ్చింది. ఇది మధ్య తరగతి ప్రజలకు భారంగా మారనుంది. వచ్చే నెల 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) మర్చంట్‌ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్‌ విధానం అమల్లోకి రానుంది. రైల్వే, టెలికాం, బీమా, ఇంధనం వంటి ప్రత్యేక విభాగాల్లో రూ.2వేలకు మించిన లావాదేవీలకు ఒక్కో చెల్లింపుపై రూ.5ల ఫ్లాట్‌ ఎండీఆర్‌ విధిస్తారు. విద్యుత్‌, మున్సిపల్‌ నీటి బిల్లులు, పైప్డ్‌ గ్యాస్‌ వంటి యుటిలిటీ చెల్లింపులకూ రూ.2,000 దాటితే రూ.5 ఫ్లాట్‌ ఎండీఆర్‌ వర్తిస్తుంది.

అన్ని రూ.2 వేల చెల్లింపులకూ

0.4 శాతం కాదు..

రూ.2 వేలకుపైబడి వ్యాపార చెల్లింపులపై 0.4శాతం ఎండీఆర్‌ వచ్చే నెల 15 నుంచి అమలుపై చర్చ

రూ.5చార్జీ.. ఇంటి బడ్జెట్‌కు కొత్త లెక్క విద్యుత్‌, నీళ్లు, గ్యాస్‌, ఫీజులు, పెట్రోల్‌, బీమా, రైలు టికెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement