కాజీపేట: కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో సీపీ శ్వేత బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, పరిసరాలు, రికార్డులు, కేసు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గణపతి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై సిబ్బందితో సమీక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సీపీ వెంట డీసీపీ ధార కవిత, ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ ఉన్నారు.


