30న జంతర్‌మంతర్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ధర్నా | - | Sakshi
Sakshi News home page

30న జంతర్‌మంతర్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ధర్నా

Jul 28 2026 2:00 AM | Updated on Jul 28 2026 2:00 AM

30న జంతర్‌మంతర్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ధర్నా

కాజీపేట: ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలతోపాటు డివిజన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 30న జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలిపారు. కాజీపేట మీడియా పాయింట్‌ ఆవరణలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జంతర్‌మంతర్‌లో ఆందోళన అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రైల్వేశాఖ మంత్రికి ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మూర్తి, మాజీ కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌, సంకు నర్సింగ్‌ ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement